కరీంనగర్ లో పాల యుద్ధం

05-11-2026 | 03:25pm
  1. డైరీల మధ్య ఆధిపత్యపోరు
  2. ఘర్షణకు దారితీసిన వివాదం

కరీంనగర్ క్రైం, నవంబర్5 (విజయక్రాంతి): గుంటూరుకు చెందిన సంగం డెయిరీ తెలంగాణ కు(Sangam Dairy Telangana) గుండెకాయ లాంటి కరీంనగర్ లో అమ్మకాలు ప్రారంభించింది.  తెలంగాణ లో ప్రసిద్ధి గాంచిన కరీంనగర్ డెయిరీ లక్ష్యంగా చేసుకొని ఆటంకాలు సృష్టించేందుకు మాటల యుద్ధం మొదలుపెట్టింది. వ్యాపారం చేసేందుకు పోటీపడకుండా కరీంనగర్ డెయిరీని టార్గెట్ చేయడం ఘర్షణ కు దారితీసింది. కరీంనగర్‌లో పాల విక్రయాల పోటీ వల్ల కరీంనగర్ డెయిరీ , సంగం డెయిరీల మధ్య ఘర్షణ (వివాదం) చోటుచేసుకుంది.

 కరీంనగర్ నగరంలోని రామ్‌నగర్ ప్రాంతంలో ఉన్న కరీంనగర్ డెయిరీ ప్రధాన కార్యాలయానికి పక్కనే సంగం డెయిరీ  తమ నూతన బ్రాంచ్‌ను (అవుట్‌లెట్) ఏర్పాటు చేశారు. గురువారం సంగం డెయిరీ నిర్వాహకులు వినియోగదారుల ముందు  కరీంనగర్ డెయిరీ యాజమాన్యం మేము మార్కెట్ లోకి రావడం వల్లే  రోడ్డు ఎక్కారని వ్యాఖ్యానించడం తో డెయిరీ మార్కెటింగ్ సిబ్బంది మధ్య ఘర్షణకు దారితీసింది. . తమకు అతి సమీపంలో ఇలాంటి వ్యాపార పోటీ  ఆఫర్లు పెట్టడంపై కరీంనగర్ డెయిరీ సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 రెండు డెయిరీల సిబ్బంది మధ్య మాటామాటా పెరిగి, తీవ్ర  ఉద్రిక్తతకు దారితీసింది. ఒకానొక సమయంలో ఘర్షణకు ధర తీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం లో పేరెన్నికగన్న కరీంనగర్ డెయిరీ పై కొందరు ప్రభుత్వ పెద్దలు తమ పలుకుబడిని వినియోగించి  కేసు నమోదు చేయించడం విమర్శలకు దారితీస్తుంది. డెయిరీ సిబ్బంది వివాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు