రాకాసిపేట్ రైల్వే స్టేషన్‌లో ఆన్‌లైన్ రిజర్వేషన్ సేవలు ప్రారంభం

05-11-2026 | 03:22pm

బోధన్, నవంబర్ 05 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ రైల్వే స్టేషన్‌లో(Rakasipet Railway Station) ప్రయాణికుల సౌకర్యార్థం ఆన్‌లైన్ రైల్వే రిజర్వేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై రాకాసిపేట్ రైల్వే స్టేషన్ నుంచే వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఏసీ, నాన్ ఏసీ రైళ్ల రిజర్వేషన్ టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు స్టేషన్ మాస్టర్ డి.వి. రాము తెలిపారు.

ఈ సదుపాయం ద్వారా బోధన్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు రైల్వే రిజర్వేషన్ టికెట్ల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. స్థానిక ప్రజలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు