ఈ నెల 9న ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభోత్సవం
05-11-2026 | 03:23pm
ఆసిఫాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలో నిర్మించిన ఐటీ టవర్‌ను(Adilabad IT Tower) ఈ నెల 9న సోమవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే కోవా లక్ష్మిని(MLA Kova Lakshmi) క్యాంపు కార్యాలయంలో టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శివప్రసాద్ కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నట్లు శివప్రసాద్ తెలిపారు