విద్యార్థుల కోసం సీతక్క కీలక నిర్ణయం
ములుగు, నవంబర్ 5 (విజయక్రాంతి): విద్యార్థుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో హాస్టల్ వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గురుకుల, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను (Student Grievances) నేరుగా తమ దృష్టికి తీసుకువచ్చేందుకు 1800-425-3369 టోల్‌ఫ్రీ నంబర్, +919493368361 వాట్సాప్ నంబర్లను (WhatsApp Helpline) విడుదల చేసినట్లు తెలిపారు.
విద్యార్థులు తమ సమస్యలను ఈ నంబర్ల ద్వారా తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమం, వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు (Hostel Facilities) ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, ఐటీడీఏ పీవో తదితరులు పాల్గొన్నారు.