జన్నారంలో భగవద్గీత పుస్తక ఆవిష్కరణ

05-11-2026 | 03:20pm

జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో భగవద్గీత పుస్తకాలను(Bhagavad Gita books) ప్రముఖ వ్యాపారవేత్త మాదాడి పూర్ణ చందర్ రావు(Madadi Purna Chander Rao) గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గం వైపు అడుగులు వేయాలని, భగవద్గీతలోని బోధనలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని ఆకాంక్షించారు.

సద్గురు శ్రీ శ్రీ యోగానంద భారతి స్వామి ఆశీస్సులతో భగవద్గీత పుస్తకాలను అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు