చిన్నగుట్టపై గోవింద నామస్మరణ.. వైభవంగా గిరిప్రదక్షిణ

05-11-2026 | 03:29pm

కొత్తపల్లి, నవంబర్ 05 (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లి గ్రామ శివారులో రామాలయ ప్రాంగణంలోని చిన్నగుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామి 3వ గిరిప్రదక్షిణ కార్యక్రమం గురువారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

శ్రీ చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో ఉదయం 7:30 గంటలకు గోపూజతో (Go Puja) ఆధ్యాత్మిక వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆశ్రమ ప్రాంగణంలోని ఆంజనేయస్వామిని దర్శించుకుని, చిన్నగుట్టపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు (Special Prayers) నిర్వహించిన అనంతరం గురూజీ ఆశీస్సులతో గిరిప్రదక్షిణ ప్రారంభమైంది.

భక్తుల సౌకర్యార్థం ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తుల విశేష స్పందనతో చిన్నగుట్ట మూడో గిరిప్రదక్షిణ (Giripradakshina) కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

ఈ కార్యక్రమంలో బండ గోపాల్ రెడ్డి, నరహరి నారాయణ రెడ్డి, పెద్ది కొమురయ్య, ముత్యం గణపతి, బోగ సుదర్శన్, చిట్కూరి శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి వూట్కూరి, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు