టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నియామకం
లింగంపేట్, నవంబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) లింగంపేట మండలం పోతాయిపల్లి కి చెందిన రాపర్తి మహేందర్ ను మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా(TRS General Secretary) నియమించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ సంపత్ గౌడ్ మహేందర్(Sampath Goud Mahender, Yellareddy Constituency In-charge) కు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ లింగంపేట మండలంలో తెలంగాణ రక్షణ సేన వాటిని మరింత పటిష్టవంతం చేస్తానన్నారు. తనకు పదవి అప్పగించిన సంపత్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, మండల టిఆర్ఎస్ పార్టీ రైతు కమిటీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, జిల్లా యూత్ అధ్యక్షులు జైల్ సింగ్, మండల యూత్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు శ్రీకాంత్, బుర్ర కృష్ణ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు సావిత్రి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు బేగరి సాయిలు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.