గ్రంథాలయ వారోత్సవాల్లో అల్ఫోర్స్ విద్యార్థికి ప్రథమ బహుమతి
కొత్తపల్లి, నవంబరు 28 (విజయక్రాంతి): జిల్లా స్థాయి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో(District level National Library Week celebrations) భాగంగా నిర్వహించిన పాటల పోటీలలో(Singing competitions) కొత్తపల్లిలోని(Kottapalli) అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో(Alforce E-Techno Schools) విద్యార్థి ఎ అభిరామ్ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి(Dr. V. Narender Reddy, Head of Alphores Educational Institutions) విజేతకు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. భవిష్యత్తులో నిర్వహించబోయే మరిన్ని పోటీలలో అద్భుతమైన ప్రదర్శనతో జిల్లా కీర్తిని వ్యాపింప చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.