విజ్ఞాన వితరణ కేంద్రాలు మన గ్రంథాలయాలు

15-11-2026 | 03:53pm

ముకరంపుర, నవంబర్ 15 (విజయక్రాంతి): అపరిమిత జ్ఞాన బాంఢాగారాలైన గ్రంథాలయాలు విజ్ఞాన వితరణ కేంద్రాలుగా నాటి నుంచి నేటి వరకు అమూల్యమైన సేవలను అందిస్తున్నాయని ప్రముఖ కవి, రచయిత, విశ్రాంత ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి(Dr. Burra Madhusudan Reddy) అన్నారు.

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను రిబ్బన్ కట్‌ చేసి, సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ పుస్తకాలు కొలువైన దేవాలయం గ్రంథాలయమని, వివిధ పోటీ పరీక్షలకు తయారు అవుతున్న యువతకు ఒక విజ్ఞాన నీడను అందిస్తున్నాయని కొనియాడారు.

పుస్తకం హస్తభూషణమే కాదు మస్తిష్క వికాస సాధనమని పేర్కొన్నారు. సభాధ్యక్షత వహించిన జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి శ్రీమతి శశిజా దేవి మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో ప్రతి రోజు ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన యువతకు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ పుస్తక ప్రదర్శనలో భాగమైన పలు అరుదైన పుస్తకాలను యువత ఉత్సాహంతో చూసారు.

మరిన్ని వార్తలు