ఎస్‌పీఓల హత్యతో అలర్ట్.. ఉగ్రవాదుల కోసం భారీ కూంబింగ్!

15-11-2026 | 03:12pm

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ (Anti-Terror Operation) చేపట్టాయి. దచ్చన్, మడ్వా అటవీ ప్రాంతాల్లో హెలికాప్టర్లు, డ్రోన్ల (Drones) సాయంతో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. సైన్యం, సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ బలగాలు సంయుక్తంగా (Joint Operation) ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ నెల 11న ఇద్దరు ఎస్‌పీఓల హత్య (SPO Killings) నేపథ్యంలో భద్రతా బలగాలు కూంబింగ్‌ను మరింత ముమ్మరం చేశాయి. మరోవైపు, ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశాయి. వారి ఆచూకీ కోసం అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.

మరిన్ని వార్తలు