సిపిఎస్ ను రద్దు చేయాలి
నిర్మల్ నవంబర్ 15 (విజయక్రాంతి): పాత పెన్షన్ విధానం(OPS) పునరుద్ధరణ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని సుమారు 2.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్యమానికి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం(SC/ST Teachers Association) మద్దతిస్తుందని సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశం ఆయన మాట్లాడారు దానికోసం జిల్లాలోని ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయులు ఉద్యమానికి సిద్దమయ్యారు.
ఈ నెల 17న సామూహిక “సెలవుతో పాటు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ధర్నా దీక్షలు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఓపీఎస్ పునరుద్ధరణ హామీ ఇచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా అమలుకు నోచుకోక పోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్ కింద పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు నెలకు కేవలం రూ.1,500 నుంచి రూ.2,500 వరకు మాత్రమే పెన్షన్ అందుతోందని యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఓపీఎస్ పునరుద్ధరణపై కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు ముఖ్య రాజేష్ నాయక్ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ ఉద్యమ కార్యాచరణను వెల్లడించారు.
మరోవైపు ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో సీపీఎస్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని, డీఏ బకాయిలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ పొందిన ఐదు వేల మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులకు హెల్త్ కార్డులు వర్తింపజేయక పోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయ సంఘాలు సంఘం నాయకత్వంతో చర్చలు జరపాలని కోరారు.అలాగే తమ సమస్యల పరిష్కారానికి స్పందించని జేఏసీ నాయకత్వం వైఖరిపైనా ఉద్యోగుల్లో అసహనం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు కార్యక్రమంలో జిల్లా నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మాజీ చందని,గుండారపు పోతన్న, జిల్లా ఉపాధ్యక్షులు ముఖ్య సుభాష్ నాయక్ గురుడు సునీల్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.