బీర్సా ముండా జయంతి వేడుకలు

15-11-2026 | 03:33pm

నిర్మల్, నవంబర్ 15 (విజయక్రాంతి): జనజాతీయ గౌరవ్ దివస్, భగవాన్ బిర్సా ముండా(Birsa Munda) 151వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్‌లు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మాట్లాడుతూ.. భగవాన్ బిర్సా ముండా గిరిజన, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యసాహసాలతో పోరాడి, గిరిజన సమాజంలో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని నింపిన మహనీయుడని పేర్కొన్నారు. భారత చరిత్రలో ఆయన పోరాటం, త్యాగం చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

గిరిజనుల ఆత్మగౌరవం, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం బిర్సా ముండా చేసిన కృషి నేటి తరాలకు ఆదర్శమని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గిరిజనుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, పట్టణ అధ్యక్షుడు సుంకరి సాయి, జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పండిత్ జాదవ్, సోన్ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, కౌన్సిలర్లు గంజి రాజు, కూన శశాంక్, నాయకులు ముత్యం రెడ్డి, రమణ రెడ్డి, జమాల్, ఈశ్వర్, వెంకటేష్, హరీష్, విజయ్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు