వివిధ శాఖల్లో నియామకాలు, పదోన్నతుల్లో స్థానిక ఆదివాసులతో భర్తీ చేయాలి

15-11-2026 | 03:39pm

తెలంగాణ ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ టీఎస్ ఏటీఎఫ్ డిమాండ్.

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 15, (విజయక్రాంతి): వెంకటాపురం మండల కేంద్రంలోని ఏ హెచ్ ఎస్ (జి) చిరుతపల్లి 1 ఆశ్రమ పాఠశాలలో జిల్లా ప్రధానకార్యదర్శి బొగ్గుల లక్ష్మయ్య అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్(Telangana Adivasi Teachers Federation) -టీ ఎస్ ఏ టీ  ఎఫ్ ములుగు జిల్లా స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోకాళ్ల శ్రీనివాసరావు, కబ్బాకుల రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏజన్సీ ప్రాంతంలోని వివిధ శాఖల్లో నియామకాలు, పదోన్నతుల్లో స్థానిక ఆదివాసులతో భర్తీ చేసేలా ప్రత్యామ్నాయ జీ ఓ, చట్టం అమలు చేసి ఆదివాసీలకు న్యాయం చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీ ఓ నెంబరు 3 కి ప్రత్యామ్నాయ జీ ఓ తీసుకురావడానికి ఆలోచన చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సమంజసం కాదని అన్నారు. 

తెలంగాణలోని ఆదివాసీ ఉపాధ్యాయులు చైతన్యం అయి గిరిజనేతర సంఘాలను విడనాడి  టీఎస్ ఏటీఎం సంఘంలో చేరి ఆదివాసుల హక్కుల సాధనలో భాగంగా కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ములుగు జిల్లా కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. ములుగు జిల్లా అధ్యక్షులు కొట్టెం వెంకటేశ్వర్లు.ప్రధాన కార్యదర్శి బొగ్గుల లక్ష్మయ్య. కోశాధికారి కట్టం రాంమూర్తి.కార్యదర్శి సిడ్డబోయి స్వామి. 

మంగపేట మండలం అధ్యక్షులు నాలి రాంబాబు, ప్రధాన కార్యదర్శి వజ్జా విష్ణు. ఏటూరునాగరం మండలంఅధ్యక్షులు వట్టం రాంబాబు.ప్రధాన కార్యదర్శి చాట్ల నారాయణ.గోవిందరావుపేట మండలం అధ్యక్షులు నాలి లింగేశ్వరారావు. ప్రధాన కార్యదర్శి కొట్టెం మంజుల. కన్నాయిగూడెం మండలంఅధ్యక్షులు ఈసం రమేష్.ప్రధాన కార్యదర్శి నల్లెబోయిన రామారావు .వాజేడు మండలం అధ్యక్షులు పూనెం రమేష్. 

ఈ కార్యక్రమంలో టి ఎస్ ఏ టీ ఎఫ్ రాష్ట్రనాయకులు పీర్ల కృష్ణబాబు, సపక నాగరాజు, కుర్సం అంజయ్య, చందా రఘుపతి, కోరం సంతోష్ కుమార్, కోరగట్ల రాజేశ్వరరావు, కొటెం వెంకటేశ్వర్లు, జెజ్జర నాగేశ్వరరావు, ములుగు జిల్లా నాయకులు పాయం నాగేశ్వరరావు, ఎట్టి బాబురావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షులు ఊకె కృష్ణ, భద్రాద్రి జిల్లా కోశాధికారి పూనెం బాలరాజు, మహబూబాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి కుంజ లక్ష్మినారాయణ, వివిధ మండల నాయకులు కారం రాంబాబు, కట్టం రాంమూర్తీ కుచ్చింటి ఇందిరా దేవి, పూనెం రమేష్, వట్టం రాంబాబు, చాట్ల నారాయణ, నాలి లింగేశ్వరరావు, మహిళా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు