ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు ప్రత్యేక కార్యక్రమం

21-11-2026 | 09:43pm

కమిషనర్ కె. రమేష్ కుమార్

తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపాలిటీ(Toopran Municipal) పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Life Insurance Scheme) అమలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి వారంలో భాగంగా నేటి 10 గంటల నుండి ప్రారంభం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కే రమేష్ కుమార్(Municipal Commissioner K. Ramesh Kumar) ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా 11, 12, 14, 16వ వార్డులలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ అన్నారు.

సంబంధిత వార్డుల ప్రజలు తమకు కేటాయించిన క్రింది కేంద్రాలలో హాజరై పథకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కమిషనర్ సూచించారు. నిర్వహించే వార్డులు, కేంద్రాల 10వ వార్డు, గ్రామపంచాయతీ కార్యాలయం, 11వ వార్డు జెండా సమీపంలో, 12వ వార్డు, మున్సిపల్ కార్యాలయంలో సెల్లార్, 14వ వార్డు గ్రంథాలయంలో 16వ వార్డు వర్తక సంఘంలో నిర్వహించడం జరుగుతుందని నమోదు చేసుకోదలచిన వారు తప్పనిసరిగా కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల ప్రతులు, రేషన్ కార్డు ప్రతులు, ఆధార్ కార్డుతో అనుసంధాన మొబైల్ ఫోన్ నంబర్ (ఓటిపి) కొరకు తీసుకొని రావాల్సిందిగా కోరారు.

మరిన్ని వార్తలు