కరీంనగర్ అంటే కాసుల పంట
అవినీతికి అందలం.. కోట్లకు పడగలెత్తిన ఖాకీలు..
దశాబ్ద కాలంలో కన్నెత్తి చూడని ఏసీబీ
కరీంనగర్క్రైం, అక్టోబర్ 13 (విజయక్రాంతి): యూనిఫాం సర్వీస్(Uniformed Service) అంటే క్రమశిక్షణకు మారుపేరుగా మాట్లాడుకుంటాం. అందుకే పక్షపాతం లేకుండా సేవలందించాలని పోలీస్ శాఖలో(Police Department) పనిచేసే అధికారులకు సొంత జిల్లాలో పోస్టింగులు ఇవ్వరు. ర్యాంకర్లకు కూ డా ప్రాధాన్యత పోస్టింగులు(Postings) ఇవ్వరు. అలాంటి పోలీస్ శాఖలో ఇతర జిల్లాల నుండి వ చ్చిన అధికారులు ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా.. శాంతి భద్రతల పర్యవేక్షణ(Monitoring of law and order)లో కఠినంగా వ్యవహరిస్తూ అసాంఘిక శక్తులకు(anti social elements) సింహ స్వప్నంగా నిలిచారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కల్లోల కరీంనగర్ కాసుల అడ్డాగా మారింది. కాసులు పెట్టీ పోస్టింగులు పట్టి కోట్లకు పడగలెత్తిన అధికారులు జిల్లాను విడిచిపెట్టే సాహసం చేయ లేకపోతున్న వైనంపై ప్రత్యేక కథనం..
కల్లోలం నుంచి కాసుల వైపు..
ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే కల్లోల ప్రాంతంగా, మావోయిస్టు పార్టీ(Maoist Party) కంచుకోటగా ఉండేది. ఇన్ఫార్మర్ వ్యవస్థ, ఉద్యమ ద్రోహులతో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే అప్పుడు పనిచేసిన పోలీస్ అధికారులకు మాత్రం రాష్ట్రవ్యాప్త గుర్తింపు వచ్చింది.దానిని అవకాశంగా మలుచుకొని కొందరు అధికారులు ఇక్కడే స్థానికత ఏర్పాటు చేసుకొని పోస్టింగులు చేస్తూ రిటైర్ అయ్యారు.తదనంతర కాలంలో వచ్చిన అధికారులకు కూడా కరీంనగర్ కాసుల వర్షం కురిపించడంతో సబ్ ఇన్స్పెక్టర్ లుగా వచ్చి ఇన్స్పెక్టర్ లు, డీఎస్పీ లుగా పదోన్నతి పొంది రిటైర్ అయ్యారు.
స్వరాష్ట్రంలో జిల్లాల పెంపు అనుకూలంగా మారి..
తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఏర్పాటు చేయడంతో పోలీసులకు మరింత అవకాశం ఏర్పడింది. ఒకప్పుడు సొంత జిల్లాలో పనిచేసే అవకాశం లేని అధికారులకు జిల్లాల ఏర్పాటుతో నాటి ఉమ్మడి జిల్లాలో పనిచేసే అవకాశం దొరికింది.ఇంకేముంది సొంతజిల్లలో చేసే అవకాశం రావడంతో అవినీతికి మార్గం సుగమమైంది.
ఉమ్మడి జిల్లాలో ఉన్న బంధువర్గం, స్నేహితులు, పరిచయా లు కాసుల వేటకు అనుకూలంగా మారింది. ఇప్పుడు కొ త్తగా పోలీస్ శాఖలో చేరేవారికి కరీంనగర్ పోస్టింగ్ అంటే కాసుల వర్షమే.రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువులో చేరిన అధికారులు కూడా కరీంనగర్ ను విడిచిపెట్టలేకపోతుండగా పక్కా జిల్లాల నుంచి వచ్చి కోట్లకు పడగలెత్తిన అధికారులు కూడా కరీంనగర్ ను వదలడం లేదు.
కాసులతో కోటలు... కన్నెత్తి చూడని ఏసీబీ
ఉమ్మడి జిల్లాలో పనిచేసిన వరంగల్,ఆదిలాబాద్,ఖమ్మం అధికారులు ఎస్ఐ, సిఐ లుగా పనిచేసి ప్రస్తుత కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలు ఏర్పడి జోన్లు మారిన ఇక్కడ పాతుకుపోయిన అధికారులు మాత్రం జిల్లాను వదలకుండా కొత్తవారిని రానివ్వకుండా పైచేయి సాధించారు. ఇక దశాబ్ద కాలంగా పాతుకుపోయిన ఈ అధికారులు కాసులతో కోటలు, వ్యవసాయ స్థలాలు, ఫామ్ హౌస్లు, స్థానిక వ్యాపారాలలో పెట్టుబడులతో అవినీతికి కేరాఫ్ అడ్ర స్గా మార్చారు.
స్టేషనరీ బిల్లుల పేరిట, అక్రమ ఇసుక వ్యాపారులు,రియల్ మాఫి యాతో చెట్టపట్టాలు వేసుకొని సస్పెన్షన్లు జ రిగినా.. తిరిగి ఇక్కడే పోస్టింగులు చేస్తున్నా రు. జిల్లాలో పదేళ్ల కాలంలో ఒక్క అధికారిని ఏసిబి పట్టుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే ఏసీబీ లో పనిచేసే అధికారులు కూడా పోలీస్ శాఖకు చెందినవారు, దానికితోడు జిల్లాలో పనిచేసే అధికారుల బ్యాచ్ వాళ్లు కావడం అని విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసు జీతాల కుంభకోణం చేసినా, ఇసుక వ్యాపారుల నుండి మామూళ్లు తీసుకున్న రియల్ వ్యాపారులతో కోట్లకు పడ గలెత్తి పోస్టింగులు కోల్పోయిన అధికారులను కూడా అవినీతి నిరోధక శాఖ పట్టిం చుకోకపోవడంపై మాతృ శాఖ పై ప్రేమేనన్న అపవాదు ఎన్నడు తొలగించు కుంటారో వేచి చూడాలి.