అమ్మ కోరుకున్నట్లే అనుపమతో..

14-10-2026 | 05:25am

నరేశ్ వీకే(Naresh VK), అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran), తరుణ్ భాస్కర్(Tharun Bhascker, ), అఖిల్ రాజ్ ఉడ్డెమారి(Akhil Raj Uddemari) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యాణం(Crazy Kalyanam)’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్‌పై బూసం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు భద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ నెల 16న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు యంగ్ హీరో అఖిల్ రాజ్. “స్క్రిప్ట్ పనులు జరుగుతున్నప్పుడే ఈ సినిమాలోని ఉదయ్ పాత్రకు నన్ను అనుకున్నారు.

ఇందులో నరేశ్, తరుణ్ భాస్కర్ క్యారెక్టర్స్‌కు ధీటుగా నా పాత్రను పర్‌ఫార్మెన్స్‌తో నిలబెట్టాలనుకున్నా. నేనెప్పుడూ మంచి కథలో, మంచి సినిమాలో నటుడిగా భాగం కావాలని కోరుకుంటా.. నిడివి ఎంత అనేది చూసుకోను. అనుపమ హీరోయిన్‌గా నటించిన ‘రౌడీ బాయ్స్’లో నేను చిన్న రోల్ చేశా. ఆ సినిమా చూస్తున్నప్పుడు.. ‘నువ్వు హీరో అయ్యాక ఈ అమ్మాయితో కలిసి నటించు’ అని మా అమ్మ చెప్పింది. ఆమె కోరుకున్నట్లే అనుపమతో నేను ఈ సినిమాలో కలిసి నటించడం హ్యాపీగా ఉంది.

అనుపమతో కలిసి నటించడం మొదట్లో భయమేసింది కానీ, తను ఇచ్చిన సపోర్ట్‌తో హాఫ్ డేలోనే కంఫర్ట్‌గా ఫీలయ్యా. ప్రతి సీన్ చేసే ముందు నేను అనుపమ ఎవరెలా చేయాలనేది మాట్లాడుకునేవాళ్లం. ప్రేక్షకుల మెప్పు పొందని సినిమాలో మూడు గంటలు కనిపించే కంటే ఇలాంటి మంచి సినిమాలో బాగా కుదిరాడు, బాగా నటించాడనే పేరొస్తే చాలు కదా! మార్కెట్, కమర్షియాలిటీ వీటన్నింటి కంటే నాలాంటి నటులను ఒక మంచి సినిమానే ముందుకు తీసుకెళ్తుందని బలంగా నమ్ముతా” అని చెప్పారు. 

మరిన్ని వార్తలు