డ్రెస్సులే కాదు.. సైజులూ మార్చేస్తున్నారు!

14-10-2026 | 05:35am

ఇటీవల కాలంలో సినీ రంగానికి(Film Industry) చెందిన కథానాయికల ఫొటోలు, వీడియోలను ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. జాన్వీ కపూర్ మార్ఫింగ్ వివాదం తర్వాత సీనియర్ నటి శ్రియా శరణ్ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఘాటుగా స్పందించింది. సోషల్ మీడియాలో తన ముఖాన్ని వాడుతూ సృష్టించిన అసభ్యకరమైన మార్ఫింగ్ ఫొటోలను చూసి తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని ఆమె తెలిపింది.

తాజా ఇంటర్వ్యూలో శ్రియ మాట్లాడుతూ.. “సోషల్ మీడియా స్క్రోల్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నా ఫొటోలు నాకు కనిపిస్తుంటాయి. ఆ ఫొటోలు చూసి నేనే ఒక్కసారిగా షాక్ అవుతా. అసలు అక్కడ ఉన్నది నేనేనా? అనే సందేహం నాకు కలుగుతుంది. మనం ఒంటిపై వేసుకున్న దుస్తులను పూర్తిగా మాయం చేసేసి, ఏఐ సాయంతో బాడీ ప్రొపోర్షన్స్, బూబ్స్ సైజులను పెంచుతూ అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నారు. ఇది చూడటానికి చాలా అసహ్యంగా, మానసికంగా ఎంతో బాధాకరంగా ఉంటుంది.

ఒక మహిళ అనుమతి లేకుండా ఆమె శరీరాకృతిని మార్చేయడం, డిజిటల్ పద్ధతిలో వేధించడం తీవ్రమైన నేరం. ఏఐతో ఒకరి గౌరవానికి భంగం కలిగించేందుకు దుర్వినియోగం చేయడం ప్రమాదకరమైన పరిణామం. ఇలాంటి డిజిటల్ క్రైమ్స్‌ను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలి” అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీతోపాటు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారాయి. 

మరిన్ని వార్తలు