‘రుక్మిణి’.. హోంవర్క్ పోలీస్!

14-10-2026 | 05:35am

బ్లాక్‌బస్టర్ సక్సెస్(Blockbuster success) ‘కోర్ట్’ తర్వాత న్యాచురల్ స్టార్ నాని(Natural Star Nani) యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ‘అలియాస్ రుక్మిణి(Alias ​​Rukmini)’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్(Nithiin) హీరోగా నటిస్తుండగా, ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమా ఒక విలక్షణమైన కథనంతో ఆసక్తికరమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో నితిన్ సరసన కథానాయికగా బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్‌ను మేకర్స్ అధికారికంగా పరిచయం చేశారు.

ఈ గ్లింప్స్‌తో రుక్మిణి ఓ స్కూల్ టీచర్‌గా కనిపిస్తుంది. ఆమెను విద్యార్థులు ‘డెవిల్’, ‘హిట్లర్’, ‘హోంవర్క్ పోలీస్’ వంటి పేర్లతో పిలుచుకుంటుంటారు. కోపంగా బోర్డుపై తన పేరు రాస్తూ, ఆ తర్వాత విద్యార్థుల వైపు ఇంటెన్స్‌గా చూసే రుక్మిణి పాత్రను ఈ గ్లింప్స్ పరిచయం చేస్తోంది. కమాండింగ్, ఆరోగెంట్ బిహేవియర్ రుక్మిణి పాత్రలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

అందంగా కనిపిస్తూనే, ఆరోగెన్స్‌తో కూడిన రుక్మిణి పాత్రకు ఆఫియా సయ్యద్ చక్కగా సరిపోయింది. ఈ గ్లింప్స్‌లో ఆమె లుక్, అభినయం ఆకట్టుకుంటున్నాయి. సాయికుమార్, హర్షవర్ధన్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను డిసెంబర్ 4న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జోమోన్ టీ జాన్; సంగీతం: విజయ్ బుల్గానిన్; ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా; ఎడిటర్: సృజన అడుసుమిల్లి.  

మరిన్ని వార్తలు