గరివిడి లక్ష్మి చూసిన ప్రతీసారి అదే భావోద్వేగం

14-10-2026 | 05:25am

ఆనంది(Anandi) టైటిల్ రోల్‌లో( title role) నటిస్తున్న చిత్రం ‘గరివిడి లక్ష్మి(Garividi Lakshmi)’. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తు న్నారు. ఈ చిత్రానికి గౌరి నాయుడు జమ్ము దర్శకుడు. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌ను మేకర్స్ మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో కథానాయకి ఆనంది మాట్లాడుతూ.. “సినిమా చూసిన అందరి కళ్లల్లో నీళ్లు చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులే ఈ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారనిపించింది” అని తెలిపింది.

నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ‘గరివిడి లక్ష్మి’ కొత్త ప్రయత్నం. గత 10 రోజులుగా ఈ సినిమాకు అద్భుత స్పందన వస్తున్నది. ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు 15 సార్లు చూసి ఉంటా, చూసిన ప్రతిసారీ అదే భావోద్వేగం.. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుంది. సినిమా మీద నమ్మకంతోనే ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నాం. దసరా పండక్కి ఈ సినిమా కచ్చితంగా నిలబడగలదని నమ్ముతున్నాం” అని తెలిపారు. ‘ప్రీమియర్ షోలో ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందం కలిగింద’ని  డైరెక్టర్ గౌరి నాయుడు జమ్ము చెప్పారు.   

మరిన్ని వార్తలు