బాలీవుడ్‌లోకి బేబమ్మ!
‘ఉప్పెన’తో(Uppena) చిత్రసీమలో(Film Industry) అడుగుపెట్టి, తొలి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ద్వారా ఓవర్ నైట్‌లోనే కుర్రకారు గుండెల్లో ‘బేబమ్మ’గా తిష్ట వేసిన ముద్దుగుమ్మ కృతి శెట్టి(Krithi Shetty). ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ సరైన హిట్ అందుకోలేకపోయిందీ క్యూట్ బ్యూటీ. ఇక ఇటీవల విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమాలో నటించిన ఈ భామ భారీ డిజాస్టర్‌ను చవిచూసింది. ప్రస్తుతం జయం రవి సరసన ‘జీనీ’ అనే భారీ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, కృతి శెట్టికి సంబంధించిన ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఈ చిన్నది ఇప్పుడు బాలీవుడ్‌లోకి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోందనేదే ఆ వార్తల సారాంశం. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నట్టు టాక్ వినవస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి శిష్యుడు విధి ఘోడ్గాంకర్ తెరకెక్కించనున్నారని సమాచారం. ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్‌పై అభిషేక్ ఎస్ వ్యాస్ నిర్మించనున్న ఈ సినిమా ఈ ఏడాదే పట్టాలెక్కనుందట. ఈ చిత్రంలో కృతి శెట్టిని ఒక సరికొత్త అవతారంలో చూపించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.