శాతవాహన వర్సిటీలో డిసెంబర్ 5న మెగా జాబ్ ఫెయిర్

04-11-2026 | 05:25am

నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో నిర్వహణ 

కరీంనగర్, నవంబరు 3 (విజయ క్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయం(Satavahana University), ‘నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ’ల(Nipun Human Development Society) సంయుక్త ఆధ్వర్యంలో ఈ సంవత్సరం డిసెంబర్ 5 న విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భారీ ‘మెగా జాబ్ ఫెయిర్(Mega Job Fair)‘ నిర్వహించనున్నారు. ఈ మేరకు శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య  యు ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ ఈ జాబ్ ఫెయిర్(Mega Job Fair) వివరాలను  వెల్లడించారు. ఈ జాబ్ ఫెయిర్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.

ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్, కోర్ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, హెల్త్కేర్, నర్సింగ్, హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీపీఓ, కస్టమర్ సపోర్ట్, రిటైల్, ఇ-కామర్స్, లాజిస్టిక్స్, సప్లై చైన్, సేల్స్, మార్కెటింగ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, టెలికాం, డిజిటల్ మీడియా వంటి పలు విభిన్న రంగాలకు చెందిన కంపెనీలు నియామకాలు జరపనున్నాయి.

ఏదైనా గ్రాడ్యుయేషన్ (డిగ్రీ), పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ), బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. 2018 నుండి 2026 వరకు ఉత్తీర్ణులైన ఫ్రెషర్లతో పాటు అనుభవజ్ఞులైన అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

కరీంనగర్ పరిసర ప్రాంతాల విద్యార్థులు, నిరుద్యోగ యువత నేరుగా వివిధ కంపెనీల హెచ్‌ఆర్ రిక్రూటర్లతో మాట్లాడి, ఇంటర్వ్యూలకు హాజరై నేరుగా ఉద్యోగ అవకాశాలను పొందడానికి ఇది ఒక ఉత్తమ వేదిక అని వర్సిటీ అధికారులు తెలిపారు. అర్హత కలిగిన యువతీ యువకులందరూ తమ విద్యార్హతల సర్టిఫికేట్లు, రెజ్యూమ్, బయో డేటా ప్రతులతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు