శ్రీనిత్యకు జిల్లా అదనపు కలెక్టర్ అభినందనలు
ముకరంపుర, నవంబర్ 3 (విజయక్రాంతి): కరీంనగర్లోని ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(SRR Government Arts and Science College)కు చెందిన బి.ఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని ఎం. శ్రీనిత్య వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2026 రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిగా ఎంపికై దేశ రాజధానిలోని పార్లమెంట్ వేదికపై పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ డా. అశ్విని తానాజీ వాకడే, శ్రీనిత్యను ప్రత్యేకంగా అభినందించి, ఆమె సాధించిన విజయాన్ని ప్రశంసించారు. విద్యార్థులు జాతీయ స్థాయి వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటూ దేశాభివృద్ధి, ప్రజాస్వామ్య విలువలు, యువత బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు.