జంగుభాయి ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
ఆసిఫాబాద్ (విజయక్రాంతి):జంగుభాయి దేవాలయాల(Jangubhai Temples) అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్(Commissioner of Tribal Welfare Department) బీఎన్ సంతోష్‌ను కోరారు. హైదరాబాద్‌లో కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అలాగే గిరి ఇండస్ట్రీస్‌లో తయారయ్యే చిక్కీలు, సబ్బులు, షాంపూలను కొనుగోలు చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ మేడి మెస్రం దుర్గు, పురుక బాపూరావు, సలాం శ్యామ్‌రావు, గిరి ఇండస్ట్రీస్ నిర్వాహకులు పాల్గొన్నారు.