మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుళ్ళకు ఘన సన్మానం
10-11-2026 | 10:26pm
సత్తుపల్లి (విజయక్రాంతి): సత్తుపల్లి మండల పరిధిలోని తాళ్లమడ గ్రామములో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన చల్లగుళ్ళ నరసింహారావు(Challagulla Narasimha Rao)కి ఘన స్వాగతం లభించింది. ఈనెల 16వ తేదీన తన ప్రమాణ స్వీకారానికి రావలసినదిగా వ్యక్తిగతంగా కలిసేటందుకు ఉదయం నుంచి చల్లగుళ్ళ నరసింహారావు పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాళ్లమడకు వెళ్లిన ఆయనకు గ్రామస్తులు సీనియర్ నాయకులు తుమ్మల అభిమానులు ఘన స్వాగతం పలికారు.