జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికైన ఎస్‌ఐకి అభినందనలు

28-11-2026 | 08:00pm

ఖమ్మం టౌన్ (విజయక్రాంతి): 3వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్‌లో(Telangana State Police Duty Meet) ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్ఐ గంజి స్వప్న(SI Ganji Swapna) అద్భుత ప్రతిభ కనబరిచి నాలుగు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికైన  సందర్భంగా ఎస్ఐ ను వరంగల్ పోలీస్ కమిషనర్(Warangal Police Commissioner), భద్రాద్రి జోన్ ఇంచార్జ్ డీఐజీ ఎన్. శ్వేత, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లు అభినందించారు. మెడికో లీగల్ ఓరల్ టెస్ట్‌లో ఒక సిల్వర్ మెడల్. ఫోరెన్సిక్ సైన్స్‌లో ఒక సిల్వర్ మెడల్. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫోటోగ్రఫీలో ఒక బ్రాంజ్ మెడల్. లా విభాగంలో ఒక బ్రాంజ్ మెడల్ సాధించారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన ఎస్ఐ గంజి స్వప్న ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు ముంబైలో నిర్వహించనున్న 70వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయిలో నాలుగు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఖమ్మం పోలీస్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ ఇదే ప్రతిభను కొనసాగించి మరిన్ని పతకాలు సాధించి ఖమ్మం పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీ నర్సింహారావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు