పదవి విరమణ పొందిన రంగారావు సమాజ సేవలో రాణించాలి

29-11-2026 | 06:36pm

ప్రముఖ జర్నలిస్టు నజీరుద్దీన్

తుంగతుర్తి, (విజయక్రాంతి): తుంగతుర్తి గ్రంధాలయం(Tungaturthi Library)లో గ్రంథా పాలకుడుగా రంగారావు రాణించి, 32 సంవత్సరాల సుదీర్ఘమైన సేవలు గ్రంథాలయానికి అందించి ,పదవి విరమణ పొందడం బాధాకరమని ఆయన సమాజ సేవలో రాణించాలని, ప్రముఖ జర్నలిస్టు నజీరుద్దీన్ అన్నారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో రంగారావు పదవి విరమణ వీడ్కోలు సమావేశం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, జిల్లా గ్రంథాలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు హాజరై ఆయన సేవలను కొనియాడారు. సూర్యాపేట జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధి కోసం, శక్తి వంచన లేకుండా పనిచేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. విశ్రాంతి సమయంలో పేదలకు, ఉచిత సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి గుర్తింపు పొందాలని కోరారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.

మరిన్ని వార్తలు