డివిజన్ స్థాయి క్రీడా ఎంపిక పోటీలు విజయవంతం

11-11-2026 | 05:23pm

ఆసిఫాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్ మైదానంలో గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసిఫాబాద్ డివిజన్ స్థాయి క్రీడా ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి. ATDO చిరంజీవి, జిల్లా క్రీడల అధికారి మడావి షేకు పర్యవేక్షణలో పోటీలు నిర్వహించారు.

ముఖ్య అతిథి ACMO ఉద్ధవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలతో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు జోనల్ స్థాయి పోటీల్లో ఆసిఫాబాద్ డివిజన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ATDO చిరంజీవి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం లింబారావు, PD మీనా రెడ్డి, బ్రహ్మం, ఉపాధ్యాయులు, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు