యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలి
రాజాపూర్ నవంబర్ 11: యువత చదువుకొని ఉద్యోగం రాలేదని నిరాశ చెందకుండా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని అభివృద్ధి చెందాలని జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి(District DCMS Chairman Prabhakar Reddy) అన్నారు. బుధవారం మండలంలోని తిరుమలాపూర్ గ్రామంలో జూంటుపల్లి రణాతుంగా రెడ్డి ఏర్పాటు చేసిన నూతన హోటల్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరు స్వయం శక్తితో ఎదిగేందుకు స్వయం ఉపాధి మార్గాలని ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్, ఉప సర్పంచ్ రామచంద్ర, మాజీ సర్పంచులు మహేశ్వరి మహిపాల్ రెడ్డి, రామకృష్ణ గౌడ్, మాజీ ఎంపీపీ సుశీల రమేష్ నాయక్, మాజీ కో ఆప్షన్ తాహేర్ పాషా,గోపాల్ రెడ్డి, పుల్లారెడ్డి,సత్యనారాయణ గౌడ్, నర్సిములు,యాదగిరి,రాధాకృష్ణ,మల్లయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.