ఎస్‌ఐ పోస్టులకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఉద్యోగోన్నతి కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) ఆధ్వర్యంలో నాలుగు కేంద్ర బలగాల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ (GD) పోస్టుల భర్తీకి 2026 లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (LDCE) నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,167 ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన పురుష, మహిళా సర్వీస్ ఉద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బలగాల వారీగా ఖాళీలు
| కేంద్ర బలగం | పోస్టులు |
| సీఆర్‌పీఎఫ్ (CRPF) | 377 |
| ఐటీబీపీ (ITBP) | 430 |
| బీఎస్‌ఎఫ్ (BSF) | 235 |
| ఎస్‌ఎస్‌బీ (SSB) | 125 |
| మొత్తం | 1,167 |
అర్హతలు ఏమిటి?
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ (GD), హెడ్ కానిస్టేబుల్ (GD), ఏఎస్ఐ (GD) తదితర అర్హత కలిగిన సర్వీసు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ప్రాథమిక శిక్షణతో కలిపి కనీసం నాలుగేళ్ల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత బలగాల వారీగా నిర్దేశించిన ఇతర సర్వీసు, వైద్య అర్హతలు కూడా కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హులైన అభ్యర్థులు బీఎస్‌ఎఫ్ అధికారిక వెబ్‌సైట్ bsf.mha.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన సర్వీస్ సర్టిఫికెట్లు, విద్యార్హత పత్రాలు, ఫొటో, సంతకం తదితర వివరాలను సమర్పించాలి.