ప్రపంచ రాజకీయాల్లో హిస్టరీ

20-11-2026 | 07:56am

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ.. అణు యుద్ధంపై కీలక ప్రకటన!

షెన్‌జెన్: ప్రపంచ రాజకీయాల్లో చరిత్రాత్మక ఘట్టం.. అమెరికా, రష్యా, చైనా అధినేతలు ఒకే వేదికపై సమావేశమయ్యారు! ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాలుగా భావించే అమెరికా, రష్యా, చైనాల మధ్య అణ్వాయుధాల ముప్పు తగ్గించే దిశగా కీలక చర్చలు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చైనాలోని షెన్‌జెన్‌లో తొలిసారిగా త్రైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. 

ఒకే టేబుల్‌పై ముగ్గురు అగ్రనేతలు!

APEC (Asia-Pacific Economic Cooperation) సదస్సు సందర్భంగా కైలిన్ విల్లాలో ఈ ప్రత్యేక భేటీ జరిగింది. సుమారు గంటకు పైగా సాగిన సమావేశంలో అంతర్జాతీయ భద్రత, ప్రపంచ శాంతి, అణ్వాయుధాల నియంత్రణ, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై నేతలు చర్చించారు. మూడు దేశాల మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.  సమావేశం అనంతరం ‘Declaration Toward Peace’ పేరుతో ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇందులో అణు యుద్ధం ద్వారా ఏ దేశమూ విజయం సాధించలేదని, అలాంటి యుద్ధం ఎప్పటికీ జరగకూడదని మూడు దేశాల అధినేతలు స్పష్టం చేశారు. అణు ముప్పును తగ్గించడం, అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడం కోసం పరస్పర చర్చలు కొనసాగించాలని అంగీకరించారు. 

ప్రపంచ శాంతికి కొత్త అడుగు పడిందా?

అణ్వాయుధాల నియంత్రణతో పాటు ఐక్యరాజ్యసమితి (UN) సంస్కరణలు, ఇంధన సరఫరా స్థిరత్వం, అంతర్జాతీయ భద్రత వంటి అంశాలు కూడా ప్రకటనలో చోటు చేసుకున్నాయి. అయితే ఈ భేటీతోనే అణ్వాయుధాల తగ్గింపుపై నిర్దిష్ట ఒప్పందం కుదిరిందని చెప్పలేం. చర్చలు కొనసాగించేందుకు అంగీకరించడం ఈ సమావేశంలో ప్రధాన పరిణామం.  ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదికపైకి రావడం దౌత్యపరంగా చారిత్రాత్మక పరిణామంగా నిలిచింది. అయితే ఉక్రెయిన్, ఇరాన్ వంటి కీలక అంతర్జాతీయ వివాదాలపై ఈ సమావేశం నుంచి స్పష్టమైన పరిష్కారాలు వెలువడలేదు. దీంతో ఈ భేటీ ప్రపంచ శాంతికి ఎంతవరకు దోహదపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని వార్తలు