ఉద్యోగ సాధనకు నైపుణ్యాలే కీలకం
ఇంటర్న్విజన్ టెక్నాలజీ సంస్థ ఫౌండర్ తిరుమలరెడ్డి
విజ్ఞాన్స్లో విద్యార్థులకు ప్రీ-ప్లేస్మెంట్ అవగాహన కార్యక్రమం
హైదరాబాద్, అక్టోబర్ 14(విజయక్రాంతి): ప్రస్తుత పోటీ ప్రపంచంలో()Competitive World ఉద్యోగాలు(Jobs) సాధించాలంటే విద్యార్హతలతో పాటు నైపుణ్యాలు కూడా కీలకమని ఇంటర్న్ విజన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ(Intern Vision Technology Private Limited) ఫౌండర్ తిరుమల రెడ్డి సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) భూదాన్ పోచంపల్లి మండలం దేవుముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ఎంబీఏ, బీబీఏ విద్యార్థులకు బుధవారం ప్రీ-ప్లేస్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఉద్యోగ బాధ్యతలు, వేతనాలు, కెరీర్ అభివృద్ధి అవకాశాలు, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ గురించి వివరించారు. ఇంటర్వ్యూలను సమర్థంగా ఎదుర్కొనే విధానం, సంస్థలకు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో విద్యార్థుల సందేహాలకు సమా ధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కి ల్స్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, టీ మ్వర్క్, ఆత్మవిశ్వాసం ఉద్యోగ సాధనలో కీలకమని వివరించారు.
విద్యార్థులు తమ లక్ష్యా లను నిర్దేశించుకుని, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ కెరీర్లో ఎదగాలని సూచించారు. అలాగే, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తమ నైపు ణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని తెలిపారు. రెజ్యూమ్ తయారీ, సమయపాలన, ఇంటర్వ్యూలో తమ ప్రతిభ ను స్పష్టంగా వ్యక్తపరిచే విధానంపై దృష్టి సా రించాలని సూచించారు. కార్యక్రమంలో ఇం టర్న్విజన్ టెక్నాలజీ సంస్థ హ్యూమన్ రిసో ర్స్ ఎగ్జిక్యూటివ్ రాముల మేఘన, విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్. అనిల్ కుమార్, ఆయా విభాగాల డీన్లు, విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.