ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
19-11-2026 | 03:13pm
వాంకిడి, నవంబర్ 19 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో(Congress Party Office) మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి వేడుకలను మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశ ప్రజల కోసం ఇందిరాగాంధీ తన జీవితాన్ని త్యాగం చేశారని నారాయణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వద్గురే సంతోష్, ఉప సర్పంచ్ నాగభూషణం, మండల కాంగ్రెస్ కార్యదర్శి సెండే హనుమంతు, సీనియర్ నాయకులు జామల్పూర్ సుధాకర్, ఎల్లయ్య, గణేష్, సురేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.