సీఎం సభకు కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు

19-11-2026 | 03:04pm
  1. 40 వాహనాలతో సిద్దిపేటకు పటాన్‌చెరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
  2. జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన నీలం మధు

పటాన్‌చెరు, నవంబర్ 19: ముఖ్యమంత్రి సభను(Chief Minister's Meeting) విజయవంతం చేసేందుకు పటాన్‌చెరు నియోజకవర్గ(Patancheru Constituency) కాంగ్రెస్ శ్రేణులు భారీగా సిద్దిపేటకు తరలివెళ్లాయి. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్‌లోని తన క్యాంపు కార్యాలయం నుంచి సుమారు 40 వాహనాలతో బయలుదేరిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ జెండాలు, నినాదాలతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా సిద్దిపేట బాట పట్టాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు