ఇందిరాగాంధీకి ఆదిలాబాద్ కాంగ్రెస్ నివాళి

19-11-2026 | 03:01pm

ఆదిలాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న (Bharat Ratna) ఇందిరాగాంధీ జయంతి (Birth Anniversary) సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో పేదరిక నిర్మూలన (Poverty Eradication), సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ అభివృద్ధిలో ఆమె పాత్రను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు