ఇందిరా గాంధీ కి ఘన నివాళులు
జగిత్యాల, నవంబర్ 19 ( విజయ క్రాంతి ): జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి(Indira Gandhi's Birth Anniversary) సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(Jagtial Legislator Dr. Sanjay Kumar) ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించినారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సమగ్రత, సమైక్యత, అభివృద్ధి కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశ చరిత్రలో ఆమె సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల పక్షాన ముఖ్య మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ఇందిరా గాంధీ హయాంలో నిర్మించిన ప్రాజెక్ట్ లు, కెనాల్ వ్యవస్త తో వ్యవసాయ రంగం అభివ్రుద్ది చెందించి అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో అనేక కార్యాలయాలు ఇందిరా హయంలో ఏర్పాటు చేసినవేనని అన్నారు. జగిత్యాల పట్టణంలో 31 వేల కుటుంబాలకు రేపటి నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుందని అన్నారు.
జగిత్యాల పట్టణ అభివ్రుద్ది కి నిరనతరం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజెంగి నందయ్య, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి, జిల్లా సర్పంచుల ఫోరం బొలిశెట్టి గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.