సోమిని, తలాయి రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలి
పట్టీలు ఇరగడంతో రోడ్డుపై నిలిచిన బస్సు
బెజ్జూర్ నవంబర్ 19 (విజయ క్రాంతి ): బెజ్జూర్ మండలంలోని సోమిని, గూడెం మీదుగా అహిరికి వెళ్లే ఆర్టీసీ బస్సు(RTC bus) పట్టీలు ఇరగడంతో రోడ్డుపైనే నిలిచిపోయింది. అహిరికి వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదకరంగా గుంతలు ఉండడంతో గుంతలలో ఆర్టీసీ బస్సు(RTC bus) పట్టిలు ఇరగడంతో అడవి ప్రాంతంలోనే ఆర్టీసీ బస్సు(RTC bus) ఆగిపోయింది.
దీనితో ప్రయాణించే ప్రయాణికులు 1 గంట పాటు రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితిగా మారిందని ప్రయాణికులు తెలుపుతున్నారు. తలయి, సోమిని రెండు గ్రామాలకు సైతం రోడ్డు గుంతలమయం మారింది. అధికారులు వెంటనే స్పందించి రెండు రోడ్లకు మరమ్మత్తులు చేసి ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితంగా..సుఖాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
వర్షాకాలం ముగిసినప్పటికీ తలాయి రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లకు మరమ్మత్తులు చేసి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.