మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే
జగిత్యాల నవంబర్ 19 ( విజయ క్రాంతి ): జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో(Jagtial MLA Camp Office) జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా జగిత్యాల నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
ఎల్ నీ నో ప్రభావం దృష్ట్యా ప్రజలకు నిరంతరాయంగా, మెరుగైన తాగునీటిని అందించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని, నీటి సరఫరా సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏఈ లు చందన్, కృష్ణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.