సైబర్ సెక్యూరిటీపై గీతంలో ఐదు రోజుల శిక్షణ
19-11-2026 | 03:15pm
ఐఐటీ రూర్కీ సహకారంతో నవంబర్ 23 నుంచి కార్యక్రమం
పటాన్ చెరు, నవంబర్ 19: సైబర్ సెక్యూరిటీ రంగంలో(Cybersecurity field) నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అధ్యాపకులు, పరిశోధకులకు అవగాహన కల్పించేందుకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం(GITAM Deemed University) ఐదు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నిధులు, ఐఐటీ రూర్కీ సహకారంతో నవంబర్ 23 నుంచి 27 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పోస్ట్ క్వాంటం క్రిప్టోగ్రఫీ, కృత్రిమ మేధస్సు, సురక్షిత సమాచార వ్యవస్థలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు.