పేదరిక నిర్మూలణ లక్ష్యంగా సంక్షేమ పథకాలు

19-11-2026 | 03:01pm

ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి

నాగర్‌ కర్నూల్ ( విజయాక్రాంతి ): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ(Former Prime Minister Indira Gandhi) పేదరిక నిర్మూలన, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి విశేష కృషి చేశారని ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి(MLA Dr. Rajesh Reddy) అన్నారు. గురువారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు.

బ్యాంకుల జాతీయం, రాజభరణాల రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశంలో కీలక మార్పులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలన కొనసాగిస్తోందని పేర్కొన్నారు. వారితో పాటు మున్సిపల్ చైర్మన్ సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు