న్యాయవాదిగా వంశీ గౌడ్ ప్రస్థానం ప్రారంభం

19-11-2026 | 03:05pm

తుంగతుర్తి, నవంబర్ 19 (విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన యువ న్యాయవాది మొగలగాని వంశీ గౌడ్‌కు తుంగతుర్తి జూనియర్ సివిల్ జడ్జి మున్వర్ హుస్సేన్ చేతుల మీదుగా న్యాయవాద బ్యాండ్ (Advocate Band) ప్రదానం చేశారు. దీంతో ఆయన న్యాయవాదిగా కోర్టులో తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాది క్లర్క్‌గా పనిచేస్తూ న్యాయస్థానాల విధివిధానాలు, న్యాయపరమైన అంశాలపై అనుభవం సంపాదించిన వంశీ గౌడ్.. కాకతీయ విశ్వవిద్యాలయం (Kakatiya University) నుంచి ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ (Bar Council of Telangana)లో పేరు నమోదు చేసుకుని న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు.

తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ, రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమందికి సహాయం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇకపై న్యాయవాదిగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయ సేవలు అందిస్తూ, న్యాయం కోసం తనవంతు కృషి చేస్తానని వంశీ గౌడ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నపర్తి జ్ఞాన సుందర్, ప్రధాన కార్యదర్శి హరిచరణ్, సీనియర్ న్యాయవాదులు తాళ్లపల్లి సత్యనారాయణ, కారింగుల వెంకటేశ్వర్లు, కుంభం రణధీర్, గుంటూరు మధు, జిల్లా కుమారస్వామి, గుడిపూడి వెంకటేశ్వర్లు, షేక్ వజీర్, జిలకర చంద్రమౌళి, రవికుమార్, రాజారాం, సతీష్, వేణు, రాజు, సైదులు, ప్రతాప్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు