విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
కేసముద్రం: పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లో ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకొని, విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హాస్టల్ నిర్వాహకులకు కేసముద్రం మున్సిపాలిటీ చైర్ పర్సన్ బానోత్ సునీత వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ సూచించారు. కేసముద్రం పట్టణంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ను శుక్రవారం రాత్రి మున్సిపల్ చైర్ పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్ పర్సన్ డాక్టర్ అల్లం రమ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా హాస్టల్లో వసతి, ఆహార నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన మెమోను తప్పకుండా అమలు చేయాలని హాస్టల్ వార్డెన్ కు సూచించారు. హాస్టల్ గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నంత స్థానాలు చేరుకోవచ్చని, సమాజంలో గౌరవం పొందవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు.