డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన మానుకోట ప్రజాప్రతినిధులు
21-11-2026 | 09:43pm
మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాకు(Mahabubabad District) ప్రజా ప్రతినిధులు శనివారం రాష్ట్ర డీజీపీ సీ వీ ఆనంద్(DGP CV Anand) ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్(MP Porika Balaram Naik), ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళినాయక్ డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు శాఖ పనితీరు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలియజేశారు.