బోయినపేట నాగులమ్మ ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ
దాతలు, భక్తుల సహకారంతో ప్రత్యేక పూజలు, ప్రతిష్ఠాపన యాగాలు
మంథని, నవంబర్ 11 (విజయక్రాంతి): మంథని మండలం బోయినపేట గ్రామంలోని(Boyinapeta Village) నాగులమ్మ దేవాలయంలో (Nagulamma Temple) సుబ్రహ్మణ్య స్వామి, పంచముఖ నాగదేవత విగ్రహాలను దాతలు అధిమూలం శ్రీకాంత్, ఉమారాణి (హైదరాబాద్) ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా భద్రయ్య, విష్ణు పూజారుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రతిష్ఠాపన యాగాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగదేవత ఆలయ కమిటీ సభ్యులు గంట బాలయ్య, అట్టెం రాజు, కడియాల శంకర్, మోసం శంకర్, స్థానిక కౌన్సిలర్ పోతరవేణి శ్రీలత, మాజీ కౌన్సిలర్ నక్క నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.