పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు ఇంజన్
కూనారం ఆర్వోబీ సమీపంలో ఘటన.. రైల్వే అధికారుల పరిశీలన
పెద్దపల్లి, నవంబర్ 11 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే గేట్(Kunaram Railway Gate) సమీపంలో గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) సమీపంలో ఇంజన్ పట్టాలు తప్పడంతో స్థానికంగా కలకలం రేగింది.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంజన్ పట్టాలు తప్పడానికి సాంకేతిక లోపమా, ట్రాక్‌లో సమస్యా అనే కోణంలో విచారణ చేపట్టారు.
ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. ప్రస్తుతం రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.