అర్హులకు పింఛన్లు, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

17-11-2026 | 12:04pm

ఎన్నికల హామీల అమలే లక్ష్యం.. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మహమ్మదాబాద్ (విజయక్రాంతి): మండల పరిధిలోని అన్నారెడ్డిపల్లి గ్రామానికి(Annareddypalli Village) చెందిన అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు, కళ్యాణలక్ష్మి చెక్కులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టీ. రామ్మోహన్ రెడ్డి(Parigi MLA, T Ram Mohan Reddy) పంపిణీ చేశారు. నంచర్ల గేట్‌లోని పల్లవి ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్వయంగా లబ్ధిదారులకు పత్రాలు, చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Telangana Welfare Schemes) అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మీ మోహన్, ఉపసర్పంచ్, లోక్య పంచాయతీ కార్యదర్శి బోయిని జ్ఞానేశ్వర్, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు