పసిబిడ్డను చంపిన కన్నతల్లి

17-11-2026 | 11:21am

మహబూబాబాద్ (విజయక్రాంతి): కన్నపేగు బంధానికే మచ్చ తెచ్చే విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా మల్యాల శివారు దామ్యా తండాలో సోమవారం చోటుచేసుకుంది. ఎనిమిది నెలల పసిబిడ్డను కన్నతల్లే గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడింది.

కుటుంబంలో ఏర్పడిన స్వల్ప గొడవలతో ఉద్రేకానికి గురైన సుప్రజ అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. తన ఎనిమిది నెలల కుమార్తె త్రిషను గొంతు నులిమి చంపిన అనంతరం ఆత్మహత్యకు (Suicide) ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం (Shocking Incident) రేపింది. పసిబిడ్డ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి

మరిన్ని వార్తలు