అభివృద్ధికి రూ.1.50 కోట్ల నిధులు
18-11-2026 | 12:26am
సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
బాలానగర్, నవంబర్ 17: మండల కేంద్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1.50 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) శంకుస్థాపన చేశారు. ఈ పనులతో పట్టణంలో రహదారులు, మురుగునీటి పారుదల సమస్యలకు పరిష్కారం లభించనుంది. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.