అంజన్న గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం

10-11-2026 | 07:44pm

200 మందికి నేత్ర పరీక్షలు, 35 మందికి శస్త్రచికిత్స

కోదాడ నవంబర్ 10(విజయక్రాంతి) : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) ప్రోత్సాహంతో కోదాడ(Kodad) 30 వ వార్డు కౌన్సిలర్ కారింగుల ఉమ అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం కోదాడసో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం(Free Eye Medical Camp) విజయవంతమైంది. శంకర కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో మొత్తం 200 మంది పాల్గొని నేత్ర వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం 35 మందికి కంటి శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన వైద్యులు,వారికి చికిత్స చేశారు.

సామాజిక బాధ్యతతో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన కౌన్సిలర్ కారింగుల అంజన్ గౌడ్ కృషిని పలువురు అభినందించారు.ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని స్థానికులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చలిగంటి ప్రసాద్,పంది తిరపయ్య  ఎన్సిహెచ్ రాము,రాపోలు శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్,వంగవీటి శేఖర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, మిట్టకోలు కమలాకర్,చలిగంటి రంగా, తంగెళ్ళపల్లి లక్ష్మణ్, మల్లయ్య, స్టాలిన్,నర్సి, శివ, శేషు,నజీర్, రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు