కాకతీయ విశ్వవిద్యాలయం స్థాయిలో బంగారు పతకం
28-11-2026 | 08:22pm
మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : కాకతీయ విశ్వవిద్యాలయం (KU) 24వ వార్షికోత్సవం (ANNIVERSARY) సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంచిర్యాల వాగ్దేవి డిగ్రీ కళాశాల (VAGDEVI DEGREE COLLEGE) విద్యార్థిని కాసర్ల సమత బంగారు పతకాలు (GOLD MEDALS) సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ పెట్టం మల్లేష్ (PETTAM MALLESH) శని వారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణితం (MATHEMATICS), భౌతిక శాస్త్రం (PHYSICS) విభాగాలలో ప్రతిన కనబర్చి బంగారు పతకాలు సాధించడం గొప్ప విషయమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సమతను కళాశాల డైరెక్టర్లు, అధ్యాపక బృందం అభినందించారు.