ఆంజనేయ స్వామి సన్నిధిలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు..
శివంపేట్ నవంబర్ 10 (విజయక్రాంతి): శివంపేట మండలం చిన్నగొట్టిముక్కుల గ్రామపంచాయతీ పరిధిలోని చాకరిమెట్ల స్వయంభూ శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి(MLC Anji Reddy) దంపతులు సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో సారా శ్రీనివాస్, ఆలయ ఫౌండర్ ఆంజనేయ శర్మ ఎమ్మెల్సీ అంజిరెడ్డి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. చాకరిమెట్ల క్షేత్రానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత, ఆలయ విశిష్టతను వివరించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి దంపతుల రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.